Movies

కరోనా సమయంలో మెగా ఫ్యామిలీకి ఉపాసన ఎంత సాయం చేసిందో..!?

upasana konidela :కరోనా మొదటి దశ కంటే రెండవ దశ చాలా వేగంగా దూసుకొస్తూ, ఉధృతంగా సాగుతోంది. ఇప్పుడు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో షూటింగ్స్ కూడా రద్దు అవుతున్నాయి. ఎప్పుడు ఎవరికీ సోకుతుందో తెలియని పరిస్థితి నడుస్తోంది. అయితే మెగా ఫామిలీ ఎంత జాగ్రత్తగా ఉన్నా, గతంలో రామ్ చరణ్ వైరస్ బారిన పడ్డాడు. సరైన చికిత్సతో వేగంగా కోలుకున్నాడంటే అందుకు మెగా కోడలు ఉపాసన కారణం అనే చెప్పాలి.

అంతేకాదు, జనసేన అధినేతగా, పవర్ స్టార్ గా అశేష అభిమానులను సంపాదించుకుని, ఇటీవల వకీల్ సాబ్ విజయంతో సత్తా చాటిన పవన్ కళ్యాణ్ కూడా కరోనా నుండి త్వరగా రికవరీ కావడానికి కూడా ఉపాసన కారణం. మరోపక్క పుష్ప షూటింగ్ సందర్బంగా కరోనా బారిన పడిన అల్లు అర్జున్ కూడా కోలుకోడానికి ఉపాసన కీలకంగా వ్యవహరించిందని చెప్పాలి.

ఇలా కొణిదెల,అల్లు వారి కుటుంబాల నేపధ్యం గల మెగా ఫ్యామిలీ పాలిట దేవతగా ఉపాసనను కొందరు అభివర్ణిస్తున్నారు. ఫాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. దీనికి కారణం అపోలో హాస్పిటల్ యాజమాన్య బాధ్యతలను ఉపాసన చూస్తుండడమే. అందుకే ప్రత్యేక వైద్యులను రప్పించి, వైద్యం అందించడం, తగిన ఫుడ్ ప్యాకేజి అందేలా చేయడంలో ఉపాసన వ్యవహరించిన చాకచక్యం వల్లనే కొణిదెల, అల్లు వారి కుటుంబాల్లో కరోనా తగ్గిందని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."