MoviesTollywood news in telugu

హీరో ఆకాష్ గుర్తు ఉన్నాడా….ఎన్ని కోట్ల అస్థి ఉందో తెలుసా?

Anandam hero Akash :ఇండస్ట్రీలో చాలామంది నటులు వస్తుంటారు వెళ్తుంటారు. కొందరు కొన్ని మంచి సినిమాలు చేసి, మెల్లిగా ఇండస్ట్రీకి దూరం అవుతారు. వేరే వ్యాపారాల్లో ఎక్కువ నిమగ్నమవుతారు. ఇక అసలు విషయానికి వస్తే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోజా వనం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ కి ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చింది. ఈ సినిమా అనంతరం బాలచందర్ తనను చిరంజీవుడ సినిమాలో సెకెండ్ హీరోగా పెట్టినట్లు తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఆ తర్వాత ఆనందం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆకాష్ చేసి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు.మంచి అవకాశాల కోసం వేచి చూస్తున్నాడు. అయితే తను సినిమాల్లోకి రాక ముందే తమది బాగా ఉన్నత కుటుంబం అని చెప్పాడు. తన తల్లి తమిళనాడుకు చెందిన వారని, తన తండ్రి తెలుగు వ్యక్తి అని తల్లి తరపు కుటుంబ సభ్యులు టీ పౌడర్ బిజినెస్ చేస్తూ,శ్రీలంకలో ఉండేవారని.తాను కూడా శ్రీలంకలోనే పుట్టానని వెల్లడించాడు. ఆ తర్వాత లండన్ వెళ్లి,చిన్నప్పటి నుంచి లండన్ లోనే ఉన్నప్పటికీ అక్కడే ఓ స్కూల్లో తమిళం నేర్చుకున్నట్లు తెలిపాడు.

ఆనందం సినిమా షూటింగ్ సమయంలో తాజ్ హోటల్లో రూం ఇస్తామని ప్రొడ్యూసర్ చెప్పినా, డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేక గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు చెప్పాడు. తన దగ్గర పనిచేసే మేకప్ మెన్, అసిస్టెంట్ల బాగోగులు కూడా తానే చూసుకునే వాడినని చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు 10 కోట్ల బడ్జెట్ పెట్టడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంత డబ్బు తనకు ఇస్తే అంతకన్నా మంచి సినిమా చేసే వాడినని విశ్లేషించాడు. తక్కువ డబ్బులు పెట్టి, సినిమాలు తీయడం మంచి పద్దతిగా ఆకాష్ తేల్చిచెప్పాడు. లండన్ లో తనకు సొంతంగా పెట్రోల్ బంక్ ఉందని ఆకాష్ చెప్పాడు. తనకు బ్రిటీష్ పాస్ పోర్టు ఉందని వెల్లడించాడు. ఇండియాలో ఈయనకు కొన్ని గెస్ట్ హౌజ్‌లు కూడా ఉన్నాయి. మొత్తానికి సినిమాలు లేకపోయినా బిజినెస్‌లో బిజీగా ఉన్నాడు ఈయన.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."