కమెడియన్ వెన్నెల కిషోర్ రియల్ లైఫ్…ఎన్ని కోట్ల ఆస్తి…?
Tollywood comedian vennela kishore :కమెడియన్స్ కి డిమాండ్ తగ్గిందని అనుకుంటున్న సమయంలో దాదాపు అన్ని సినిమాల్లో కన్పిస్తున్న వెన్నెల కిషోర్ తన కామెడీతో జనాన్ని నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు. ఇతడి అసలు పేరు బోకాల కిషోర్ కుమార్. నిక్ నేమ్ గా వెన్నెల,కృష్ణ అని కూడా పిలుస్తారు. 1980 సెప్టెంబర్ 19న తెలంగాణలోని కామారెడ్డిలో జన్మించిన వెన్నెల కిషోర్ కి ప్రస్తుతం 41ఏళ్ళు. కామారెడ్డి లోనే జీవదన్ కాన్వెంట్ హైస్కూల్ లో చదివాడు. యుఎస్ లో మిచిగాన్ యూనివర్సిటీలో బికాం, అండ్ మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేసాడు.
వెన్నెల కిషోర్ కి నలుగురు అక్కలు ఉన్నారు. యితడు ఇంటర్ పూర్తయ్యేసరికి నలుగురు అక్కలకు పెళ్లి అయింది. ఇక అమెరికాలో స్టడీస్ పూర్తయ్యాక ఉద్యోగం చేస్తుండగా, ఓ తెలుగు అమ్మాయితో పరిచయం ప్రేమగా మారడంతో 2012లో సురేఖతో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక హైదరాబాద్ లో ఉండగా వారానికొక సినిమా చూసేవాడు. ఒకసారి వెన్నెల సినిమాకు ఆర్టిస్టులు కావాలని పేపర్ ప్రకటన రావడంతో ఆడిషన్స్ వెళ్లి సెలెక్ట్ అయ్యాడు.
అలా దేవా డైరెక్షన్ లో వెన్నెల మూవీతో పరిచయమైన కిషోర్ ఆ సినిమాకి మంచి మార్కులు పడడంతో ఆ సినిమా పేరే ఇంటిపేరుగా మారింది. వెన్నెల కిషోర్ గా టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు. మొదటి సినిమాకు 68 వేలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. తాజాగా నితిన్ రంగ్ దే మూవీకి 3లక్షల 70వేలు అందుకున్నాడు. తాను రాసుకున్న కథతో బ్రహ్మానందం హీరోగా జఫ్ఫా మూవీ డైరెక్ట్ చేసి, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతడికి చిరంజీవి, బ్రహ్మానందం ఫేవరేట్ హీరోస్. విజయశాంతి ఇష్టమైన హీరోయిన్. సిడ్నీ అంటే ఇష్టమైన ప్రదేశం. ఇతడి నెట్ వర్త్ 20కోట్ల వరకూ ఉంటుంది. హైదరా బాద్ హైటెక్ సిటీలోని వైష్ణవి నిర్వాణ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. దీని ఖరీదు 80లక్షలు ఉంటుంది. ఒక టయోటా కారు ఉంది.

