MoviesTollywood news in telugu

సింగర్ సునీత జీవితాన్ని మార్చిన షో…ఏమిటో తెలుసా?

Tollywood Singer Sunitha :ఈ మధ్యే రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకున్న సింగర్ సునీత అందంగా పాడడమే కాదు, ఎంతో మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెబుతూ వారి ఉన్నతికి దోహదం చేస్తోంది. అయితే ఆమె కెరీర్ ని అప్పట్లో ఓ షో మలుపు తిప్పింది. పాడవే కోయిల పేరిట దూరదర్శన్ లో ప్రసారమైన షో తో సునీత క్రేజ్ హెచ్చింది. ఇద్దరు పిల్లల అంగీకారంతో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం సాగిస్తోంది.

ప్రస్తుతం జెమినిలో డ్రామా జూనియర్ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న సునీత దూరదర్శన్ షో తర్వాత కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన గులాబీ మూవీలో ‘ఈవేళలో నీవు’ సాంగ్ పాడే ఛాన్స్ వచ్చింది. ఈ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఇక అక్కడ నుంచి తన కేరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు.

పక్కా ప్లాన్ తో ఇండస్ట్రీలో తనకంటూ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరుతెచ్చుకున్న సునీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఇక కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఫేస్ బుక్, ఇంస్టా గ్రామ్ ద్వారా పాటలు పాడుతూ ఫాన్స్ ని అలరిస్తోంది. ఇక సింగర్ సునీత కూతురు కూడా సింగర్ గా ఇండస్ట్రీలో సత్తా చాటాలని చూస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."