యంగ్ టైగర్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా?
Tollywood Heroine Gajala :ఇండస్ట్రీకి ఎందరో హీరోయిన్స్ వస్తుంటారు, వెళ్తుంటారు. అయితే వాళ్ళు నటించిన సినిమాలు శాశ్వతం. కొన్ని సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ గజాల తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ హిట్స్ అందుకుంది. టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తూనే జగపతి బాబు సరసన నాలో ఉన్న ప్రేమ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దాంతో పలు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి.
ముఖ్యంగా ఎస్ ఎస్ రాజమౌళి తొలిసారిగా డైరెక్షన్ చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేయడం ద్వారా గజాల మంచి పాపులర్ అయింది. తెలుగు,తమిళ భాషల్లో పలు సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది. దానికి తోడు ఛాన్స్ లు కూడా బాగా రావడంతో బిజీ హీరోయిన్ గా మారింది. ఇలా బిజీగా ఉన్నప్పుడే సడన్ గా ఇండస్ట్రీకి దూరమైంది.
అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న గజాల తన ఇంష్టాగ్రామ్ లో కనురెప్పలు ఎగరేస్తూ, క్యూట్ గా ఉన్న వీడియో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయింది. కాగా టాలీవుడ్ లో ఓ హీరోతో ప్రేమలో పడి ఆత్మహత్య యత్నం చేసుకుందన్న వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందన కూడా లేదు. కానీ తర్వాత బాలీవుడ్ లో సీరియల్ హీరోని పెళ్ళిచేసుకుని ప్రస్తుతం కుటుంబంతో హ్యాపీ గా ఉంది.

