మంగమ్మ గారి మనవడు సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Mangamma gari Manavadu Movie : కోడి రామకృష్ణ డైరెక్షన్ లో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించిన మంగమ్మగారి మనవడు మూవీ బాలకృష్ణ కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్. బాలయ్యను హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన చిత్రం ఇది. సుహాసిని హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో భానుమతి నయనమ్మగా నటించి, సాంగ్స్ కూడా పాడడం విశేషం. 1984సెప్టెంబర్ 7న రిలీజైన ఈ సినిమాకు దాదాపు అరడజను సినిమాలు పోటీకి వచ్చాయి. అదేరోజు అందాల నటుడు శోభన్ బాబు నటించిన అభిమన్యుడు మూవీ కూడా రిలీజయింది.
విజయశాంతి, రాధిక హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసారు. కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ మూవీ ఎబో ఏవరేజ్ అయింది. ఈ సినిమాకు వారం రోజుల ముందుగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఉద్దండుడు మూవీ రిలీజయింది. ఈ మూవీ ప్లాప్ అయింది. మంగమ్మగారి మనవడు మూవీకి ఒక్కరోజు ముందుగా చిరంజీవి ఇంటిగుట్టు మూవీ వచ్చింది. అప్పటికే ఖైదీతో చిరుకి క్రేజ్ ఉండడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ కమర్షియల్ గా నిరాశ పరిచింది. కె బాపయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుహాసిని హీరోయిన్.
మంగమ్మగారి మనవడు సినిమాకు 13రోజుల గ్యాప్ తో అక్కినేని నాగేశ్వరరావు డబుల్ రోల్ చేసిన జస్టిస్ చక్రవర్తి రిలీజయింది. జస్టిస్,లాయర్ పాత్రల్లో అద్భుతంగా అక్కినేని నటించిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అందుకుని,ఏవరేజ్ అయింది. దీనికి కూడా దాసరి డైరెక్టర్. మంగమ్మగారి మనవడు మూవీకి రెండు వారాల గ్యాప్ తో సుమన్ ,శివకృష్ణ, భానుప్రియ నటించిన ఎదురులేని మొనగాళ్లు రిలీజయింది. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకుని ఏవరేజ్ అయింది. మొత్తానికి మంగమ్మగారి మనవడు మొదటి స్థానంలో నిలవగా, శోభన్ బాబు అభిమన్యుడు రెండో ప్లేస్ లో వచ్చింది.

