ఇంటికి దీపం ఇల్లాలు నటి జ్యోతి రెడ్డి భర్త ఎవరో తెలుసా?
Intiki deepam illalu serial actress jyothi reddy : ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతూ విశేష ఆదరణ పొందుతున్న ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో నటీనటులు తమ అందంతో,నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇక ఇందులో నటిస్తున్న రాజేశ్వరి బుల్లితెరకు కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా సీరియల్స్ లో చేసింది. నటిగా, యాంకర్ గా, డాన్సర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి అసలు పేరు జ్యోతి రెడ్డి. తెలంగాణలో ఆగస్టు 4న జన్మించింది. అక్కడే పెరిగింది.
అయితే జ్యోతిరెడ్డి తండ్రి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యక్తి. బిఎస్ ఎన్ ఎల్ లో టాప్ ఆఫీసర్ గా పనిచేస్తూ సౌత్ ఏరియాకు ప్రెసిడెంట్ గా పనిచేసారు. ఈమె తల్లి గృహిణి. ఇక పెళ్లి కూడా అయిన జ్యోతిరెడ్డికి ఇద్దరు పిల్లలు.భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీరు. ప్రస్తుతం కార్తీక దీపం,అమ్మకోసం, ఇంటికి దీపం ఇల్లాలు,దేవత,గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో నటిస్తున్న జ్యోతిరెడ్డి తన నటనతో తెలుగుబుల్లితెర ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకుంటోంది.
చిన్నతనం నుంచి డాన్స్ అంటే ఇష్టం కావడంతో జ్యోతిరెడ్డి ఆరేళ్ళ వయస్సులోని డాన్స్ స్కూల్లో చేరి, కూచిపూడి నేర్చుకుంది. వరల్డ్ వైడ్ 2వేల ప్రదర్శలను ఇచ్చింది. 9వ తరగతి చదువున్న సమయంలోనే తల్లి ఎంకరేజ్ మెంట్ తో డామిట్ కథ అడ్డం తిరిగింది అనే సీరియల్ తో దూరదర్శన్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. మూడు దశాబ్దాల బుల్లితెర జీవితంలో రక్త సంబంధం,ఎండమావులు,అష్టాచెమ్మా,చంద్రముఖి, రామచక్కని సీత, చదరంగం, నెంబర్ వన్ కోడలు, వంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.