నారప్ప మూవీలో కొడుకుల పాత్రలు వేసిందెవరో తెలుసా ?
Unknown facts about narappa sons :ఇతర భాషల్లో హిట్టైన మూవీస్ లో తనకు సూట్ అయ్యే కథలనే ఎంచుకుని హిట్స్ కొట్టే విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో ఎక్కువ రీమేక్ లు చేస్తూ వస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించి హీరో ధనుష్‌కు జాతీయ పురస్కారం కూడా తెచ్చి పెట్టిన ‘అసురన్’కి రీమేక్ మూవీగా నారప్ప ను తాజాగా చేసాడు. మే 14న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించక పోవడంతో జూలై 20న ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో రిలీజయింది. ఏ పాత్ర ఎంచుకున్నా అందులో పరకాయ ప్రవేశం చేసి మాతృక సినిమాను మర్చిపోయేలా చేయడంలో వెంకీ దిట్ట.
అందుకే నారప్ప కూడా అనుకున్న దానికన్నా హిట్ అయింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ మూవీలో వెంకీ భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి నటించి మంచి మార్కులు కొట్టేసింది. నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా గా కార్తీక్ రత్న,రెండో కుమారుడు సిన్నప్ప గా రాఖీ నటించారు. కళ్ళముందే అన్నయ్యను చంపిన వాళ్లపై పగ తీర్చుకునే సీన్ లో సిన్నప్ప అద్భుతంగా నటించాడు. సిన్నప్పగా నటించిన ఇతడి అసలు పేరు గీతాకృష్ణ. రాఖీ అని నిక్ నేమ్ తో పిలుస్తారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేసిన రాఖీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, మంచి హిట్ కొట్టడం విశేషం. ఇక మునిఖన్నా పాత్రలో కార్తీక్ రత్నం కూడా అదరగొట్టాడు. ఇతడికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ కెమెరా ముందు ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా నటించి సెహబాష్ అనిపించు కున్నాడు. నేచురల్ స్టార్ నాని మూవీలో కూడా కార్తీక్ రత్న నటించబోతున్నాడు. ఇక తమ్ముడి పాత్రలో చేసిన రాఖీ అయితే ఆనందానికి అవధుల్లేవ్. తన అన్నయ్య వలన మూవీస్ లోకి వచ్చానని రాఖీ అంటున్నాడు.

