MoviesTollywood news in telugu

ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోని గుర్తు పట్టారా…?

prabhas childhood photos : ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. ఆదిపురుష్ హిందీ మూవీలో శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. హిందీ,తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. అలాగే మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వినీదత్ నిర్మించే మరో సినిమాలో కూడా ప్రభాస్ చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతోంది.

ఇప్పటికే రాధేశ్యాం మూవీ షూటింగ్ పూర్తి అయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సోదరుడు స్వర్గీయ యువి సూర్యనారాయణరాజు కుమారుడైన ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు ఫ్యామిలీతో కల్సి పెరిగాడు. 2002లో కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఎన్నో హిట్ మూవీస్ లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. వర్షం,ఛత్రపతి,డార్లింగ్,మిర్చి,బాహుబలి,సాహో వంటి సినిమాల్లో తన నటనతో ఫాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

ఇక ప్రభాస్ పెళ్లి గురించి కూడా తరచూ రకరకాల వార్తలు వస్తున్నా ఇంకా పెళ్లి పీటలు ఎక్కడం లేదు. సోషల్ మీడియాలో కూడా కొంచెం యాక్టివ్ గానే ఉండే ప్రభాస్ తాజాగా తన చిన్ననాటి ఫోటోలను షేర్ చేసాడు. దీంతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు. వీరలెవెల్లో లైకులు,కామెంట్స్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."