రాధమ్మ కూతురు సీరియల్ బుజ్జమ్మ రియల్ లైఫ్ లో ఏమి చేస్తుందో…?
Radhamma kuthuru serial actress bujjamma :జి తెలుగు ఛానల్ లో మంచి టీఆర్ఫీ రేటింగ్ తో నడుస్తున్న రాధమ్మ కూతురు సీరియల్ లో నటీనటులు తమ అందంతో,నటనతో జనానికి దగ్గరయ్యారు. ఈ సీరియల్ కి ఎక్కువమంది అభిమానులున్నారు. అందుకే బాగా పాపులర్ అయింది. ఈ సీరియల్ లో అరవింద్ కి అమ్మగా నటిస్తున్న బుజ్జమ్మ తన అందంతో,అభినయంతో తొలిసిరియల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బుజ్జమ్మ అసలు పేరు సౌమ్యలత. కర్ణాటకలో పుట్టిన ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుని పూర్తిచేసింది. ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూనే మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది.అనుకోకుండా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె 20ఏళ్ళ ప్రస్థానం పూర్తిచేసుకుంది.ఈమె పలు సీరియల్స్, సినిమాలు,యాడ్ ఫిలిమ్స్ లో నటించింది.

సౌమ్యలత నటించిన మాంగల్య సీరియల్ కన్నడలో హిట్ గా నిలిచింది. దాదాపు 70సీరియల్స్ లో నటించిన ఈమె సీరియల్స్,సినిమాల ద్వారా కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగులో రాధమ్మ కూతురుతో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. బెజవాడ బుజ్జమ్మగా నటిస్తూ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

