MoviesTollywood news in telugu

ఆ మూవీకి రెమ్యునరేషన్ బాగా పెంచేసిన పవర్ స్టార్…ఎంతో తెలుసా?

Pawan kalyan New Movie remunaration : గబ్బర్ సింగ్ మూవీ టాలీవుడ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. వరుస ప్లాప్ లతో సతమవుతూ, హిట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఫాన్స్ దాహార్తిని తీర్చింది. ఆతర్వాత వరుస హిట్స్ వచ్చాయి.

అయితే రాజకీయాల్లో చేరాక పవన్ సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తున్న తరుణంలో రీ ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ సినిమాతో పవన్ తన స్టామినా ఏమిటో చూపించాడు. ఆ సినిమా చేస్తుండగానే వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ క్రిష్ డైరెక్షన్ లో నడుస్తోంది. ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలున్నాయి. అలాగే బీమ్లా నాయక్ మూవీ కూడా పూర్తి చేయబోతున్నాడు.

మరోపక్క హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేయబోయే మూవీ కూడా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాపై ఫాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఫాన్స్ ఊహిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ మూవీకి 50 కోట్లు తీసుకున్న పవన్ ఈ మూవీకి మరో 10కోట్లు పెంచినట్లు టాక్. దీనికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక సైరా మూవీ తీసిన సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో కూడా మరో మూవీకి పవన్ రెడీ అవుతున్నాడు.