MoviesTollywood news in telugu

NTR, ANR ఇద్దరిలో ఎవరు పెద్ద?

Ntr And Anr Age :తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ,ఏ ఎన్ ఆర్ రెండు కళ్ళుగా చెబుతుంటారు. ఇద్దరూ ఇంచుమించు ఒకే వయస్సు వారని తెలుస్తూ ఉంటుంది. పౌరాణిక, జానపద చిత్రాలతో నందమూరి తారక రామారావు దూసుకెళ్తే, అక్కినేని నాగేశ్వరరావు తన స్థాయికి తగ్గట్టు సాంఘిక చిత్రాల్లో దూసుకెళ్లారు. ఇద్దరి మధ్యా పోటీ ఉన్నా, ఇద్దరూ మంచి మిత్రులు.

ఆరోగ్యకరమైన పోటీ మధ్య ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ చిత్రసీమను ఏలారు. అయితే వీరిద్దరిలో ఎవరు గొప్ప, ఎవరు ఎక్కువ అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికే అక్కినేని పల్నాటి యుద్ధం, బాలరాజు, కీలుగుఱ్ఱం, లైలా మజ్ను వంటి మూవీస్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు.

అక్కినేని తర్వాత 5ఏళ్ళ 10నెలలకు ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చారు. అయితే వచ్చాక పౌరాణిక,జానపద చిత్రాలకు అక్కినేని దూరంగానే ఉంటూ వచ్చారు. తన పర్సనాల్టీకి తగ్గ పాత్రలను ఎంచుకుని ముందుకు వెళ్లారు. ఇక అక్కినేని కన్నా నందమూరి వయస్సు రీత్యా 16నెలలు పెద్ద. ఇద్దరూ కల్సి గుండమ్మ కథ, మిస్సమ్మ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించారు. ఎవరికి వారే సాటి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."