బావా బావమరిది సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?
Suman Movie Bava Bavamaridi :రెబెల్ స్టార్ కృష్ణంరాజు,నవరస కథానాయకుడు సుమన్ కాంబినేషన్ లో వచ్చిన బావా బావమరిది మూవీ అప్పట్లో ఓ సెన్షేషన్. జయసుధ, మాలాశ్రీ నటించిన ఈ మూవీని శరత్ కుటంబ కథా చిత్రంగా తీర్చిదిద్దారు. 1993జూన్ 4న రిలీజైన ఈ మూవీలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్. ఇక సిల్క్ స్మిత పై చిత్రీకరించిన బావలు సయ్యా సాంగ్ ఓ సంచలనం.
రాజ్ కోటి సంగీతం అలరిస్తుంది. ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి వారం గ్యాప్ తో రేలంగి నరసింహారావు డైరెక్షన్ లో రాజేంద్రప్రసాద్ నటించిన కన్నయ్య కిట్టయ్య మూవీ రిలీజయింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ డబుల్ రోల్ చేసాడు.ఎబో ఏవరేజ్ అయింది.
అదేరోజు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో మనీ మూవీ రిలీజయింది. జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన ఈ మూవీలో ఖాన్ దాదాగా బ్రహ్మానందం కామెడీ అదిరిపోయింది. అందుకే నంది అవార్డు వచ్చింది. అలాగే కోట శ్రీనివాసరావు హాస్యం పండింది. శివ నాగేశ్వరరావు డైరెక్ట్ చేసారు.జయసుధ,పరేష్ రావెల్ నటన ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని అందుకుంది.
హరీష్,సౌందర్య జంటగా నటించిన ఇనస్పెక్టర్ ఝాన్సీ మూవీ బావ బావమరిది కి రెండు వారాల గ్యాప్ తో రిలీజయింది.జయసుధ ఓ ప్రముఖ పాత్ర పోషించిన ఈ మూవీకి సదాశివరావు డైరెక్టర్. లవ్ అండ్ యాక్షన్ పార్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. అయితే బావ బావమరిదికి వారం ముందుగా మే 27 న మెగాస్టార్ చిరంజీవి నటించిన మెకానిక్ అల్లుడు వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ గా విజయశాంతి అలరించింది. మొదటివారం మంచి కలెక్షన్స్ రాబట్టి, ఫైనల్ గా ఏవరేజ్ అయింది.

