MoviesTollywood news in telugu

మహేష్ – త్రివిక్రమ్ మూవీ కోసం భారీ సెట్…ఎన్ని కోట్లో…?

Mahesh Babu New Movie :సరిలేరు నీకెవ్వరు తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కి అంతరాయం కలిగినా, మళ్ళీ బిజీగా మారిపోయాడు. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ మూవీ షూటింగ్ గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఎందుకంటే మహేష్‌తో బ్లాక్ బస్టర్ అతడు,ఆతర్వాత ఖలేజా మూవీస్ డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ ఈ సారి మహేష్‌లో యాక్షన్ యాంగిల్ ఎలా ఉండబోతోందో చూపించబోతున్నాడట. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఏకంగా 5 కోట్ల రూపాయల ఖర్చుతో ఓ భారీ ఇంటి సెట్‌ నిర్మిస్తున్నారట. ఈ సెట్‌లో సినిమాకు సంబంధించిన చాలా భాగం షూట్ చేస్తారని టాక్. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక మహేష్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ను సూపర్ స్టైలిష్‌గా చూపించబోతున్నారట. మహేష్‌కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో యాక్షన్ తో పాటు వినోదం మేళవించి తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దుబాయ్, గోవాలో పూర్తిచేసి, త్వరలో స్పెయిన్‌‌‌కు వెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచలనాలను భారీగా పెంచేసింది.