MoviesTollywood news in telugu

నటి రాజ్యలక్ష్మి పెళ్లి ఎలా జరిగిందో…భర్త,పిల్లలు ఏమి చేస్తున్నారో…?

Tollywood Heroine sankarabharanam rajyalakshmi :కళాతపస్వి కె విశ్వనాధ్ డైరెక్ట్ చేసిన శంకరాభరణం సినిమాలో పెద్దగా స్టార్స్ లేరు. కొందరు కొత్తవాళ్లు, మరికొందరు పెద్దగా పేరు లేనివాళ్లు కూడా ఇందులో నటించారు. కానీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ నాలుగు పదులు పూర్తిచేసుకున్నా ఇప్ప్పటికీ శంకరాభరణం ఆడియన్స్ మదిలో పదిలమే.

శంకరశాస్త్రి కూతురుగా నూతన నటి రాజ్యలక్ష్మి నటించింది. పెళ్ళిచూపులో చంద్రమోహన్ ని చూస్తూ పాడే పాటలో రాజ్యలక్ష్మి నటన అద్భుతం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమెకు వరుస ఛాన్స్ లు వచ్చాయి. తెలుగుతో పాటు పలు భాషల్లో అగ్ర హీరోలతో కల్సి నటించింది. అయితే సింగపూర్ కి చెందిన ఓ వ్యక్తిని పెళ్ళిచేసుకుని అక్కడే సెటిల్ అయింది. ఇద్దరు పిల్లలు కూడా. పెద్ద కొడుకు సినిమాల్లో ఎంట్రీకి రెడీగా ఉన్నాడట. అన్నట్టు రాజ్యలక్ష్మి కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో పలు సినిమాలు చేసి ఆడియన్స్ ని మెప్పించింది.

షూటింగ్స్ ఉన్నప్పుడు ఇండియా వస్తూ, లేనపుడు సింగపూర్ వెళ్తోంది. ఇంతకీ పెళ్లి ఎలా జరిగిందంటే,ఒకరోజు చెన్నైలో హోటల్ కి డిన్నర్ కి వెళ్ళినపుడు రాజ్యలక్ష్మి సోదరునితో పాటు సింగపూర్ కి చెందిన అతడి ఫ్రెండ్ వచ్చాడట. రాజ్యలక్ష్మిని చూసి, సింగపూర్ షూటింగ్స్ కి వస్తే తనను కలవమని విజిటింగ్ కార్డు ఇచ్చాడట. అలా ఏర్పడ్డ పరిచయంతో ఇష్టపడడం, పెళ్లి ప్రపోజల్ తేవడం,ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఒకే అని ఆమె చెప్పడం చకచకా జరిగిపోయాయి. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయి, సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం దుమ్మురేపుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."