MoviesTollywood news in telugu

ముప్పలనేని శివ కెరీర్ లో టాప్ సినిమాలు…మీరు చూసారా…?

Muppalaneni Siva Top Movies :తన కెరీర్ లో డైరెక్టర్ ముప్పలనేని శివ పలు హిట్ మూవీస్ అందించారు. 1990 దశకంలో మంచి సినిమాలను అందించి తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.తొలిసినిమా నిరాశ పరచడంతో రెండవ సినిమాగా సురేష్ మూవీస్ బ్యానర్ పై శ్రీకాంత్ హీరోగా మోనికా బేడీ హీరోయిన్ గా తెరకెక్కించిన తాజ్ మహల్ మూవీ ముప్పలనేని శివకు హిట్ ఇచ్చింది. ఎం ఎం శ్రీలేఖ సంగీతం అలరించింది.

వడ్డే నవీన్, ప్రేమ జంటగా తెరకెక్కించిన కోరుకున్న ప్రియుడు మూవీ ముప్పలనేని మంచి విజయాన్ని అందించింది. 1997లో వచ్చిన ఈ మూవీ హీరో నవీన్ కి మొదటి సినిమా కావడం విశేషం.ఇక పూర్తిస్థాయి కామెడీతో ముప్పలనేని తెరకెక్కించిన సందడే సందడి మూవీ మంచి విజయాన్ని అందుకుంది. కోటి స్వరాలు ఆకట్టుకున్నాయి.

వడ్డే నవీన్, సిమ్రాన్, అబ్బాస్ నటించిన ప్రియా ఓ ప్రియా మూవీని ముప్పలనేని తెరకెక్కించి, సక్సెస్ అందుకున్నాడు. 1997లోనే ఈ మూవీ వచ్చింది. శ్రీకాంత్ హీరోగా రాశి, మీనా నటించిన గిల్లికజ్జాలు మూవీని 1998లో ముప్పలనేని తెరకెక్కించారు. కోటి మంచి సంగీతం అందించాడు.

తనకు ఎంతో ఇష్టమైన విక్టరీ వెంకటేష్ తో రాజా సినిమాను ముప్పలనేని శివ డైరెక్ట్ చేసి తన స్వప్నాన్ని సాకారం చేసుకోవడమే కాదు, బ్లాక్ బస్టర్ కొట్టాడు. 1999లో విడుదలైన ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్ గా నటించగా, అబ్బాస్ కీలక పాత్ర చేసాడు.

అమ్మాయికోసం మూవీని కొత్తకోణంలో ముప్పలనేని శివ తీసి విజయాన్ని అందుకున్నాడు. 2001లో రిలీజైన ఈ మూవీకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. నీ ప్రేమకై మూవీ 2002లో వచ్చింది. అబ్బాస్, వినీత్ నటించిన ఈ మూవీకి ఎస్ ఏ రాజ్ కుమార్ మంచి మ్యూజిక్ అందించారు. ఇక ఎస్ ఏ రాజ్ కుమార్ సాంగ్స్ ఈ సినిమాకు ఎసెట్.

సంక్రాంతి మూవీ చేయడం ద్వారా 2005లో మరోసారి వెంకీతో బ్లాక్ బస్టర్ ని ముప్పలనేని శివ అందుకున్నాడు. శ్రీకాంత్, స్నేహ,ఆర్తి అగర్వాల్, సంగీత,శారద కీలక పాత్రలు పోషించారు. డాక్టర్ రాజశేఖర్ హీరోగా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన రాజబాబు మూవీ కూడా ముప్పలనేని మంచి పేరు తెచ్చింది. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతం ఆకట్టుకుంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."