MoviesTollywood news in telugu

పురి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా?

Puri Jagannath Son Akash Puri Life Style :చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి, మెహబూబా మూవీతో హీరోగా పేరుతెచ్చుకున్న ఆకాష్ పూరి తాజాగా రొమాంటిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ అసలు పేరు పెట్ల ఆకాష్ పూరి జగన్నాధ్. ఆకాష్,నిక్కు అని పిలుస్తారు.

1997ఏప్రియల్ 12న హైదరాబాద్ లో జన్మించిన ఆకాష్ కి 24ఏళ్ళు నిండాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివి,తర్వాత డిగ్రీ కూడా పూర్తిచేసాడు. తల్లి పేరు లావణ్య.ఆకాష్ కి పవిత్ర జగన్నాధ్ అనే సిస్టర్ ఉంది. స్కూల్ డేస్ లోనే చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిరుత మూవీలో చెర్రీ చిన్నప్పటి పాత్రలో ఆకాష్ కనిపిస్తాడు. దీనికి పూరి జగన్నాధ్ దర్శకుడు.

బుజ్జిగాడు,ఏక్ నిరంజన్,బిజినెస్ మ్యాన్,గబ్బర్ సింగ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసాడు.2015లో ఆంద్ర పోరి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, నటన పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 12లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. 2018లో పూరి డైరెక్షన్ లో మెహబూబా మూవీలో చేసాడు. దీనికి 25లక్షలు అందుకున్నాడు.

ఇక అనిల్ డైరెక్షన్ లో రొమాంటిక్ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఆకాష్ 30లక్షలు అందుకున్నాడట. ట్రావెలింగ్, బ్యాడ్మింటన్ అంటే ఇష్టపడే ఆకాష్ కి ఇంకా పెళ్లి కాలేదు. మాల్దీవులు అంటే మక్కువ. ఇతడి దగ్గర రెండు అధునాతన కార్లున్నాయి.మాదాపూర్ లో దాదాపు 19కోట్ల విలువైన ఖరీదైన ఇల్లు ఉంది. 300కోట్లు నెట్ వర్త్ ఉంటుంది. ప్రభాస్,మహేష్ బాబు ఇష్టమైన హీరోలు. సమంత ఇష్టమైన హీరోయిన్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."