MoviesTollywood news in telugu

పసివాడి ప్రాణం సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరు?

pasivadi pranam Movie : మెగాస్టార్ చిరంజీవి,విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన పసివాడి ప్రాణం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసాడు. 1987లో విడుదలైన ఈ మూవీ చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పింది.అయితే ఈ మూవీ నిజానికి కృష్ణ చేయాల్సి ఉందట. విట్ నెస్ అనే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. హారీస్ ఇన్ ఫోర్డ్ ఇందులో హీరో.ఓ హత్యను కళ్లారా చూసిన ఓ కుర్రాడు ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందనేది చిత్ర కథలోని మూలం.

అయితే మలయాళ దర్శకుడు ఫాజిల్ కి ఈ మూవీ నచ్చడంతో కొన్ని మార్పులు చేసి, 1986లో ముమ్ముట్టి హీరోగా పూవిన్ పుతియా పేరిట మూవీ తీశారు. నదియా హీరోయిన్. సురేష్ గోపి విలన్ గా నటించిన ఈ మూవీలో బేబీ సుజిత కీలకపాత్ర పోషించింది. హిట్ కావడంతో తమిళంలో సత్యరాజ్ హీరోగా తీస్తే అక్కడా హిట్ అయింది. రఘువరన్ విలన్ గా నటించాడు. ఇళయరాజా పాటలు అదరగొ ట్టాయి. 1987లో వచ్చిన ఈ మూవీ విజయం సాధించడం తెలుగు ప్రొడ్యూసర్స్ ని ఆకర్షించింది.

ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం చాలామంది పోటీ పడగా, అల్లు అరవింద్ కి దక్కాయి. అయితే విట్ నెస్ మూవీ చూసిన దర్సక నిర్మాత విజయబాపినీడు ఓ కథ రెడీ చేసి,సాక్షి అనే పేరు పెట్టారు. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించనున్న ఈ మూవీకి అట్లూరి రాధాకృష్ణ నిర్మించడానికి ముందుకొచ్చారు. బాలనటుడిగా మహేష్ బాబుని అనుకోవడం కృష్ణ ఒకే చేయడం అయ్యాయి. షూటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇదే కథతో చిరంజీవి సినిమా చేస్తున్నట్లు తెల్సి, విజయబాపినీడు తన ప్రయత్నాన్ని విరమించుకుని, ఆతర్వాత కన్నడ మూవీ ఆధారంగా మహారాజశ్రీ మాయగాడు మూవీ రూపిందించారు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."