MoviesTollywood news in telugu

స్టార్స్ మరణించిన తర్వాత రిలీజైన సినిమాలు…ఎన్ని హిట్ అయ్యాయో..?

Movies released after celebs death :సినిమా నటులు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అందుకే వాళ్ళు చనిపోయినపుడు ఫాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక నటీనటులు చనిపోయాక వాళ్ళ సినిమాలు రిలీజై, చాలావరకూ మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకున్న దివ్య భారతి కేవలం 19 ఏళ్ల వయసులోనే అంటే 1993లో చనిపోయింది. అప్పటికే ఈమె కొన్ని సినిమాలు సైన్ చేసింది. దివ్య భారతి మరణానంతరం హిందీలో రంగ్, శత్రంజ్.. తెలుగులో తొలి ముద్దు మూవీ రిలీజయ్యాయి.

సౌందర్య 2004 ఎప్రిల్ 17న హెలికాప్టర్ క్రాష్‌లో దుర్మరణం పాలైంది.కానీ అప్పటికే ఆమె ఒప్పుకున్న సినిమాలున్నాయి. ఆమె చనిపోయిన తర్వాత ఆప్తమిత్ర,మోహన్ బాబు శివశంకర్ సినిమాలు విడుదలయ్యాయి.

అక్కినేని నాగేశ్వరరావు లివ్స్ ఆన్ అంటూ నాగార్జున ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. అలాంటి నాగేశ్వరరావు 2014 జనవరి 22న చనిపోగా, ఆయన నటించిన చివరి సినిమా మనం ఆయన చనిపోయిన ఐదు నెలల తర్వాత అంటే మేలో విడుదలైంది. మంచి సక్సెస్ అయింది.

అలాగే కన్నడ సీనియర్ హీరో విష్ణువర్ధన్ 2009 డిసెంబర్ 30న మరణించగా, అయన హీరోగా నటించిన ఆప్తరక్షక 40రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 9న విడుదలై సంచలన విజయం సాధించింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న సుశాంత్ మరణించగా, ఆయన చనిపోయిన 40 రోజుల తర్వాత అంటే జులై 24న ఈయన చివరి సినిమా దిల్ బెచారా ఓటిటిలో విడుదలై, సంచలన విజయం సాధించింది.

తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోగా, యితడు నటించిన చివరి సినిమా 2022,మార్చ్ 17న విడుదల కానుంది. ఆ రోజు ఆయన జయంతి కావడం వలన ఈ డేట్ ఫిక్స్ చేసారు. ఇప్పటికే జేమ్స్ షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఓ పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డబ్బింగ్ కోసం అత్యాధునిక టెక్నాలజీ వాడుకుంటున్నారు.