MoviesTollywood news in telugu

మాస్ మహారాజ్ రవితేజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా…?

Tollywood Hero Raviteja remuneration :వరుస ప్లాప్ ల నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ అయ్యాక మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ మూవీ బాగానే ఆకట్టుకోవడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. దీనికి తోడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచాడని టాక్.

అసలే కరోనా కారణంగా సినిమా రంగం దెబ్బతిన్న సమయంలో డిమాండ్ మేరకు ప్రొడ్యూసర్స్ ఇస్తారా లేదా అని చర్చ నడుస్తోంది. సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఒక మూవీ, నక్కిన త్రినాధరావు డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్న రవితేజ తాజాగా ఇంకో మూవీకి కమిట్ అయ్యాడు.

టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కావడంతో చేయడానికి రవితేజ ఒకే చెప్పాడట. దీనికి అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అయితే దీనికి ఏకంగా 18కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలా ఇస్తే, సినిమా బడ్జెట్ 50కోట్లు పైమాటే అని అంటున్నారు. కాగా యితడు నటించిన ఖిలాడీ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. అలాగే రామారావు ఆన్ డ్యూటీ మూవీ షూటింగ్ వేగంగా నడుస్తోంది.