MoviesTollywood news in telugu

సూపర్ స్టార్ కృష్ణ 1985లో రికార్డ్ స్థాయి మూవీస్…ఎన్ని హిట్…?

Tollywood Hero Super star Krishna :తెలుగు వెండితెరపై ఎన్నో సాంకేతిక మార్పులు తెచ్చిన సూపర్ స్టార్ కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ముద్రవేసుకున్నారు. మోసగాళ్లకు మోసగాడు మూవీ తీసి సెన్సేషనల్ హిట్ కొట్టారు. ఎవరెన్ని చెప్పినా తాను తీయాలన్న సినిమా తీయడంలో కృష్ణ దిట్ట.

కౌబాయ్ ఇంగ్లీషు మూవీని కొన్ని మార్పులు, చేర్పులతో తెలుగులో మోసగాళ్లకు మోసగాడు అలాగే తీశారు.కలర్, స్కోప్, 70ఎం ఎం , ఇలా మార్పులు తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ వల్లే సాధ్య పడ్డాయి. ఏడాదికి ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన ఘనత కూడా కృష్ణదే. ఇక 1985లో ఏకంగా 8సినిమాలు రిలీజయ్యాయి.

అగ్నిపర్వతం జనవరి 11న విడుదలై సూపర్ హిట్ కి ఆ ఏడాది శ్రీకారం చుట్టి ఏకంగా 6హిట్స్ అందుకున్నాడు. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కృష్ణ డబుల్ రోల్ చేయగా, విజయశాంతి, రాధ హీరోయిన్స్. ఆ తర్వాత ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన పల్నాటి సింహం పెద్ద హిట్ గా నిల్చింది. రాధ, జయసుధ హీరోయిన్స్.

తరువాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కృష్ణ, శ్రీదేవి నటించిన వజ్రాయుధం రిలీజై హిట్ కొట్టింది. ఇక విజయనిర్మల డైరెక్షన్ లో వచ్చిన సూర్య చంద్ర మూవీ కమర్షియల్ హిట్. జయప్రద, రాధ హీరోయిన్స్ . శోభన్ బాబుతో కల్సి నటించిన మహాసంగ్రామం నిరాశ పరిచింది. అయితే కలెక్షన్స్ దుమ్మురేపింది. జయసుధ, జయప్రద హీరోయిన్స్.

అయితే అందరికంటే మొనగాడు, మహామనీషి నిరాశ పరిచాయి. తర్వాత తాతినేని రామారావు డైరెక్షన్ లో వచ్చిన పచ్చని కాపురం సూపర్ సక్సెస్ అయింది. కృష్ణ సరసన శ్రీదేవి నటించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."