MoviesTollywood news in telugu

ఆనంద్ దేవరకొండ లగ్జరీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా ?

Anand Devarakonda Luxury Lifestyle : విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ హిట్ కోసం చూస్తున్నాడు. పుష్పక విమానం మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్న ఆనంద్ ని నందు, చిన్నూ అని నిక్ నేమ్స్ తో పిలుస్తారు. 1994మార్చి 15న తెలంగాణలోని అచ్చంపేటలో గోవర్ధనరావు, మాధవి దంపతులకు జన్మించిన ఇతడికి ప్రస్తుతం 27ఏళ్ళు పూర్తయ్యాయి.

సికింద్రాబాద్ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ లో, లయోలా కాలేజీ లో చదివిన ఆనంద్ ఫారిన్ లో జాబ్ స్టార్ట్ చేసాడు. వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టాలని అనుకున్నాడు.అయితే హైదరాబాద్ వచ్చినపుడు విజయ్ తో కల్సి షూటింగ్స్ కి వెళ్లడం వలన సినిమాల్లో నటించాలనే కోరిక పుట్టింది.

2019లో దొరసాని మూవీలో హీరోగా నటిస్తూ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ మూవీ చేసాడు. ఇందులో మంచి పేరు వచ్చింది. దామోదర డైరెక్షన్ లో పుష్పక విమానం మూవీ చేస్తున్నాడు. మొదటి సినిమాకు 40లక్షలు, రెండవ సినిమాకు 50లక్షలు కన్నా ఎక్కువ తీసుకున్నాడు.

పుష్పక విమానం మూవీకి 70లక్షలు ఛార్జి చేసిన ఆనంద్ కి ఇంకా పెళ్లి కాలేదు. ఇతడి దగ్గర రెండు సౌకర్యవంతమైన కార్లు ఉన్నాయి. చెస్ ఆడడం హాబీ. మహేష్ బాబు, షారుఖ్ ఖాన్ ఇష్టమైన హీరోలు. పారిస్, మాల్దీవులు ఇష్టమైన ప్రదేశాలు. ఫిలిం నగర్ లో దాదాపు 18కోట్ల విలువైన ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతడి నెట్ వర్త్ 50కోట్లు ఉంటుందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."