మహేష్ కి వాయిస్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా?
Bullet bhaskar dubbing mahesh babu :సినిమా హీరోకి అందునా సూపర్ స్టార్ కి జబర్దస్త్ కమెడియన్ బులెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్పాడా అని ఆశ్చర్య పోతున్నారా? కానీ ఇది నిజమేనట. అయితే మహేష్ బాబుకి తెలియకుండా డబ్బింగ్ చెబుతున్న యితడు మహేష్ బాబుని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అలాంటి ఛాన్స్ వచ్చినా వేరే వాళ్లకు ఇచ్చేశాడట.
జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కమెడియన్స్ కి ఆధారం చూపించి, చక్కని వేదిక అయింది. అదే సమయంలో డబ్బు కూడా బాగానే సంపాదిస్తూ, వివిధ షోస్, సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందిపుచ్చుకుంటున్నారు. అయితే వన్ మూవీకి మహేష్ కి భాస్కర్ డబ్బింగ్ చెప్పాడట. ఎందుకంటే చాలామంది వాయిస్ లను ఇమిటేట్ చేసే బులెట్ భాస్కర్ చాలామంది వాయిస్ లను తన గొంతులో పలికించాడు.
అయితే కమెడియన్స్ బ్రహ్మానందం గొంతుని అనుకరించలేనని అంటున్నాడు. వన్ మూవీతో పాటు కొన్ని యాడ్స్ లో కూడా మహేష్ వాయిస్ కి డబ్బింగ్ చెప్పానని, ఒకసారి మహేష్ ని కల్సినప్పటికీ, సర్కారు వారి పాట షూటింగ్ సమయంలో కలిసే ఛాన్స్ వచ్చిందని, అయితే మరో వ్యక్తికి ఆ ఛాన్స్ ఇచ్చేసానని, ఎప్పటికైనా కలుస్తానని బులెట్ భాస్కర్ చెబుతున్నాడు. తన గురించి మహేష్ తెలుసుకుని ఆశ్చర్యపోయాడని కూడా భాస్కర్ అంటున్నాడు.
