MoviesTollywood news in telugu

పుష్ప సినిమాలో సునీల్ పాత్ర సర్ప్రైజింగ్ గా ఉంటుందా…?

pushpa movie Sunil : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే ఫాన్స్ కి పండగే. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తున్న పుష్ప మూవీ కి సంబంధించి వస్తున్న వార్తలు, పిక్స్, ఫస్ట్ లుక్స్ ఇలా అన్నీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌, లిరికల్‌ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప కోసం బన్నీ గెటప్ ఊర మాస్ గా ఉంది. గంధపు చెక్కల స్మగ్లర్ రోల్ లో బన్నీ లుక్స్ అదిరి పోతున్నాయి. తాజాగా ఇందులో నటిస్తున్న కమెడియన్ సునీల్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పుష్ప సినిమాలో మంగ‌ళం శ్రీను అనే పాత్ర‌లో సునీల్ క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పటి వరకు పలు చిత్రాలలో హాస్యనటుడిగా, కొన్ని సినిమాల్లో హీరోగా మెప్పించిన సునీల్‌ తొలిసారిగా ‘పుష్ప’ కోసం విల‌న్‌ అయ్యాడు.

గతంలో ఎన్నడూ చూడని విధంగా బ‌ట్ట‌త‌ల‌తో, భ‌యంక‌ర‌మైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫస్ట్ లుక్ లో సునీల్ దర్శనమిచ్చి షాక్‌ ఇచ్చాడు. హీరోకి చెమటలు పట్టించే విధంగా విలన్ పాత్రలో సునీల్ అదరగొట్టాడని టాక్. మొత్తానికి సుకుమార్ ఈ పాత్ర ద్వారా రిస్క్ చేస్తున్నాడని టాక్. మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌ తో ఈ మూవీని నిర్మిస్తోంది. పుష్ప షూటింగ్ పూర్తికావడంతో పార్ట్ 1 వచ్చే డిసెంబర్ 17న రిలీజ్ కానుందని ఇప్పటికే యూనిట్ ప్రకటించింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."