MoviesTollywood news in telugu

నాగ్ షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాలసిందే..!

King Nagarjuna Paisley Silk Shirt Cost : అరవై దాటినా 20ఏళ్ళ కుర్రాడిలా యంగ్ హీరోలతో పోటీపడి నటిస్తూ మన్మధుడిలా ఉన్న అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ ఈ మధ్యే రిలీజ్ కాగా తాజాగా ‘ది ఘోస్ట్’, ‘బంగార్రాజు’సినిమాలు చేస్తున్నాడు. ఇక మరో పక్క బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో కి వరుసగా మూడోసారి హోస్ట్‌గా చేస్తున్నాడు. యాంకరింగ్ లో కూడా యంగ్‌లుక్స్‌తో స్టైలిష్‌గా నాగార్జున ఈ షోలో తన సత్తా చాటుతున్నాడు.

ముఖ్యంగా వీకెండ్‌ ఎపిసోడ్స్‌లో నాగార్జున కాస్ట్యూమ్స్‌ కోసం ప్రత్యేక శైలి కనబరుస్తూ ఉంటాడు. మామూలుగానే సెలబ్రిటీలు ఏ చిన్న విషయమైనా చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇక నాగార్జున ధరించిన ఓ షర్ట్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ లో నాగ్ కనిపించాడు. దీంతో లెమన్‌ ఎల్లో కలర్‌లో ఉన్న ఈ షర్ట్ ఖరీదు గురించి నెటిజన్లు ఆరా తీశారు. తీరా ధర తెలిసాక షాకయ్యారు. ఈ షర్ట్‌ ధర దాదాపు $1310 డాలర్లు. ఇండియన్‌ కరెన్సీలో అయితే సుమారు 83,908 రూపాయలు. ఏడైనా టాలీవుడ్‌ మన్మథుడుకి ఆ మాత్రం ఉండాలని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."