సినిమాల్లోనే కాదు…బిజినెస్ లో కూడా సత్తా చాటుతున్న సూపర్ స్టార్
Mahesh babu business Details : నటశేఖర్ కృష్ణ టాలీవుడ్ లో డాషింగ్ అండ్ డేరింగ్ హీరోగా ఎన్నో చిత్రాలు తీసి, తెలుగునాట సూపర్ స్టార్ అయ్యారు. కృష్ణ నట వారసత్వం అందుకుని చిత్రసీమలో అడుగుపెట్టిన మహేష్ బాబు తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పటికీ తన అందాన్ని కాపాడుకుంటూ అభినయం జోడించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఓపక్క సినిమాలు నటిస్తూనే మరోపక్క యాడ్స్ లో చేస్తూ దాదాపు పది కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు. ఇలా రెండు చేతులా సంపాందించిన సొమ్ముని బిజినెస్ రంగంలో కూడా పెట్టుబడులు పెడుతూ రాణిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో ఏ ఎంబి మల్టీఫ్లేక్స్ నిర్మించి లాభాల బాటలో నడిపిస్తున్నాడు.
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాడు. కొన్ని కంపెనీలలో స్లిపింగ్ పార్ట్ నర్ గా కూడా ఉన్నాడు. ఇక నమ్రత కూడా తక్కువేం తినలేదు. దుస్తుల వ్యాపారంలో అడుగుపెట్టిన నమ్రత అందులో బాగానే రాణిస్తోంది. ఇప్పుడు మరో మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం కోసం మహేష్ అడుగులు వేస్తున్నాడని టాక్. ఏ వ్యాపారం చేసినా బంగారమే అన్నట్లుగా మహేష్ దూసుకుపోతున్నాడు.
ఒక్కో సినిమాకి దాదాపుగా 50 కోట్లు తీసుకుంటున్నాడు. అంతేకాక లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నాడు. ఒక వైపు సినిమాలు మరో వైపు బిజినెస్ లో కూడా బాగా సంపాదిస్తున్నాడు.
