MoviesTollywood news in telugu

వెంకటేష్, నాగ చైతన్య సహా టాలీవుడ్ మామ మేనల్లుళ్లు వీరే…లుక్ వేయండి

Tollywood nephews :ఇప్పటి వరకు హీరోల కొడుకులు, నటీనటుల వారసులు ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. అయితే మేనల్లుళ్ళు కూడా ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి మేనల్లుడు. అలాగే చిరంజీవి చెల్లెలు కుమారుడు సాయి ధరమ్ తేజ్ కూడా మేనమామల బాటలో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరో మేనల్లుడు వైష్ణవ తేజ్ కూడా ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా దగ్గుబాటి వెంకటేష్ సోదరి లక్ష్మి కొడుకే. దాంతో వెంకీ మామ బాటలో చైతు నడుస్తున్నాడు. అయితే నాగార్జున బాటలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన సోదరి కుమారుడు సుమంత్ మొదట్లో మంచి హిట్స్ కొట్టినా ఇప్పుడు సరైన సినిమా పడడం లేదు. నాగ్ మరో మేనల్లుడు సుశాంత్ కూడా హీరోగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

ఆలా వైకుంఠపురంలో మూవీలో ఈమధ్య కన్పించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జ కన్నడలో స్టార్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. అయితే అర్జున్ మరో మేనల్లుడు దివంగత చిరంజీవి సర్జ కన్నడలో స్టార్ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఇంతలోనే గుండెపోటుతో అకాల మరణం పొంది, విషాదం మిగిల్చాడు.

ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్.. మామ బాటలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు. టాలీవుడ్ లో దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కృష్ణను వెండితెరకు పరిచయం చేయడమే కాదు, మూగ మనసులు వంటి బ్లాక్ బస్టర్ మూవీని పూర్తి అవుట్ డోర్ లో తీశారు. ఆదుర్తి మేనల్లుడు సత్యానంద్ ఆయన అసిస్టెంట్‌గా పలు చిత్రాలకు పనిచేసి, ఆ తర్వాత ప్రముఖ కథా రచయతగా టాలీవుడ్‌లో అగ్ర హీరోల చిత్రాలకు కథలు అందించారు.

ఇక దర్శకుడిగా కూడా ఓ చిత్రం కూడా రూపొందించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్,రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్.. మామ బాటలో మ్యూజిక్ డైరెక్టర్‌గా దుమ్మురేపడంతో పాటు నటుడిగా కూడా రాణిస్తున్నాడు. మహేష్ భట్ సోదరి కుమారుడు ఇమ్రాన్ హష్మి కూడా బాలీవుడ్‌లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకు న్నాడు.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బావ సుధీర్ బాబు హీరోగా చేస్తుండగా, తాజాగా మహేష్ బాబు అక్క పద్మావతి కుమారుడు, మహేష్ కి మేనల్లుడు అయిన గల్లా అశోక్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరి కుమారుడు ఆశిష్ కూడా రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."