MoviesTollywood news in telugu

బోయపాటి కెరీర్ లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్…?

Director Boyapati Srinu hits and flops : తాజాగా నందమూరి నటసింహం బాలయ్యతో కల్సి తీసిన అఖండ మూవీతో విజయాన్ని అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసాడు. అయితే అందులో హిట్స్, ప్లాప్స్ విషయానికి వస్తే, రవితేజతో తీసిన భద్ర మూవీ బ్లాక్ బస్టర్.

వెంకటేష్, నయనతార లతో తెరకెక్కించిన తులసి సూపర్ హిట్. ఇక బాలయ్యతో తీసిన సింహా బ్లాక్ బస్టర్ అయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన దమ్ము మూవీ ప్లాప్ అయింది. తర్వాత బాలయ్యతో తీసిన లెజెండ్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ తో తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీ హిట్ అయింది.

తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ మూవీ ప్లాప్ అయింది. ఇక తాజాగా బాలయ్యతో తీసిన అఖండ మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో బోయపాటికి మళ్ళీ ఇమేజ్ వచ్చింది. తదుపరి మూవీస్ ఏమిటో తేలాల్సి ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."