కుంకుమ పువ్వు సీరియల్ కిరణ్ రియల్ లైఫ్…అసలు నమ్మలేరు
kumkuma puvvu serial actor kiran real life : టివి సీరియల్స్ ఆయా ఛానల్స్ లో పోటాపోటీగా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. స్టార్ మా ఛానల్ లో మధ్యాహ్నం పూట ప్రసారమవుతున్న కుంకుమ పువ్వు సీరియల్ బాగానే ఆదరణ చూరగొంటోంది. ఇందులో నటిస్తున్న నటీనటులు తమ అందంతో అభినయంతో ఆకట్టుకుంటున్నారు.
హరిత జాకీల కు కొడుకుగా నటిస్తున్న కిరణ్ నెగెటివ్ రోల్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడి అసలు పేరు సురేష్ చంద్ర. సెప్టెంబర్ 12న తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జన్మించాడు. తన స్టడీస్ మొత్తం అంటే డిగ్రీ కూడా వరంగల్ లోనే పూర్తిచేసాడు.
చదువుకునే రోజుల్లో పలు యాక్టివిటీస్ లో చురుగ్గా పాలొన్న సురేష్ సినిమాలతో తన కెరీర్ స్టార్ట్ చేసాడు. ప్రణయ వీధుల్లో మూవీలో హీరోగా చేసాడు. సరిగ్గా గుర్తింపు రాకపోవడంతో క్యారెక్టర్ యాక్టర్ గా మారాడు. తర్వాత టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే , సప్త మాత్రిక, గోకులంలో సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనసు మమత వంటి సీరియల్స్ లో చేసాడు. ప్రస్తుతం కుంకుమ పువ్వు సీరియల్ తో ఆకట్టుకుంటున్నాడు.

