MoviesTollywood news in telugu

తమిళ టాప్ 10 హీరోల రెమ్యునరేషన్స్..ఎంతో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tamil top 10 heroes remuneration : టాలీవుడ్ హీరోల కన్నా కోలీవుడ్ హీరోలు తమిళంలోనే కాదు, అన్ని భాషల్లో వేగంగా దూసుకుపోతున్నారు. వివిధ భాషల్లో డబ్బింగ్ చేసి, కలెక్షన్స్ రాబడుతున్నారు. అయితే అక్కడి హీరోలు అందుకునే రెమ్యునరేషన్ కూడా హై రేంజ్ లోనే ఉందని అంటున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి మొదటి నుంచి తెలుగు తదితర భాషల్లో కూడా మార్కెట్ ఉంది.

ఈయన నటించే సినిమాకు 50కోట్ల వరకూ అందుకుంటారని టాక్. అలాగే సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా పిలిచే కమల్ హాసన్ కూడా 25నుంచి 30కోట్లు ఒక్కో సినిమాకు అందుకుంటూ బిజీగా ఉన్నారు. హీరో అజిత్ కి కూడా తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఒక్కో సినిమాకు 42నుంచి 50కోట్లు అందుకుంటాడని టాక్.

ఇక విజయ్ సంగతి చెప్పక్కర్లేదు. యితడు ఒక్కో మూవీకి 45నుంచి 50కోట్లు ఛార్జి చేస్తున్నాడని అంటున్నారు. తమిళంతో సమానంగా తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఒక్కో సినిమాకు 20 – 22కోట్ల వరకూ అందుకుంటాడని టాక్.హీరో ధనుష్ అయితే 15కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

యితడు రజనీకాంత్ కి అల్లుడు. తెలుగులో చాలా మూవీస్ డబ్బింగ్ కూడా అయ్యాయి. విజయ్ సేతుపతి తమిళంలో బిజీగా ఉంటూనే తెలుగులో కూడా చేస్తున్నాడు. యితడు ఒక్కో సినిమాకు 8నుంచి 12కోట్లు తీసుకుంటున్నాడట. మరో హీరో శివకార్తికేయన్ కూడా ఇదే రేంజ్ లో అందుకుంటున్నాడని అంటున్నారు.

కార్తీ ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటాడు. ఇక విక్రమ్ విషయానికి వస్తే ఒక్కో సినిమాకు 20 కోట్ల వరకు తీసుకుంటాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."