MoviesTollywood news in telugu

మహానటి సావిత్రి ఆస్తులు అమ్ముకోవటానికి కారణం అయిన సినిమా ఇదే

star heroine mahanati savitri : మహానటి సావిత్రి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఆమె బయోపిక్ సినిమాగా రావడంతో చాలామంది ఇంకా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. సెర్చ్ చేస్తుంటే చాలా విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆమె ఉన్నత స్థాయి నుంచి అమాంతం కిందకి పడిపోవడానికి ఓ సినిమా కారణమన్న వార్త చక్కర్లు కొడుతోంది.

ర్యాష్ డ్రైవింగ్ , ఆటలు ఆడడం, ఎడమ చేతివాటం ఇలా ఎన్నో విషయాలను మహానటి మూవీలో చూపించారు. ఆమె ఇంట్లో నగలు తయారు చేసే కార్కానా ఉండేదని కూడా చూసాం. అయితే క్షణం తీరిక లేకుండా బిజీగా సినిమాలు చేస్తూ ఎంతో సంపాదించింది. ఎందరికో సాయం చేసింది.

నర్తన శాల మూవీ కోసం అయితే ఏకంగా 12గంటలు పనిచేసేదని చెబుతారు. అయితే డివి నరసరాజు వంటి ఉద్దండ రచయితలు సినిమాలు నిర్మించవద్దని చెప్పినప్పటికీ పెడచెవినపెట్టి సినిమాలు తీసిన సావిత్రి దారుణంగా దెబ్బతింది. చిన్నారి పాపలు మూవీ డైరెక్ట్ చేసి, వాటాదారుల దెబ్బతో ఇబ్బంది పడింది. మూగమనసులు, వింత సంసారం మూవీస్ తమిళంలో రీమేక్ చేసి మరింత నష్టపోయింది. సినిమా రంగం వింతైన ప్రపంచం అన్నారు అందుకే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."