MoviesTollywood news in telugu

సిరివెన్నెల నెలకు ఎన్ని పాటలు రాసేవారు…సంపాదన ఎంతో తెలుసా?

sirivennela :ఇప్పుడు ఎక్కడ చూసినా గేయ రచయిత సిరివెన్నెల గురించే. అయన మరణం తర్వాత ఒక్కసారిగా ఎన్నో సంఘటనలు, వార్తలు, జ్ఞాపకాలు వైరల్ అవుతున్నాయి. సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, దాదాపు 3వేలకు పైగా అద్భుతమైన పాటలను సినిమా రంగానికి అందించారు. చివరి క్షణం వరకూ ఆయన పాటలు రాసారు.

ఈయన పాట లేనిదే రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్,… ఇలా ఎందరో దర్శకులు సినిమాలు తీయలేదంటే అతిశయోక్తి కాదు. ఇక విశ్వనాధ్ అయితే సిరివెన్నెల లోని సాహిత్య పటిమను పూర్తిగా వినియోగించుకున్నారు. అయితే డబ్బుకోసం కాకుండా సన్నివేశం నచ్చి పాటలు రాసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయట.

రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా ఎంతిస్తే అంతే తీసుకుని చక్కని పాటలు అందించిన సిరివెన్నెల జ్ఞాపకాలు ఇంకా అందరినీ వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు మూడున్నర దశాబ్దాల సినిమా ప్రయాణంలో దాదాపు 800సినిమాల్లో 3వేలకుపైగా పాటలు రాయడమే కాదు, ఇంకా ఆయన రాసిన సినిమా పాటల తాలూకు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అందులో ఆర్ ఆర్ ఆర్ , శ్యామ్ సింగరాయ్ వంటి మూవీస్ ఉన్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."