అఖండలో విగ్గు కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలుసా ?
akhanda Movie :కరోనా సెకండ్ వేవ్ తర్వాత చాలా సినిమాలు ఓటిటి లోనే వస్తున్నాయి. అయితే అఖండ సినిమా నేరుగా థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయం సొంతం చేసుకుంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ కొట్టడంతో హ్యాట్రిక్ సాధించారు.
పాజిటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ సినిమా గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రెండు పాత్రలు వేసిన బాలయ్య అఘోరా పాత్రలో అద్భుతంగా మెప్పించాడు. మురళీకృష్ణ పాత్రలో అయితే చాలా అందంగా కన్పించాడు. దీనికి ప్రధాన కారణం విగ్గు అని అంటున్నారు. మొత్తం 3 విగ్గులు రప్పించడంతో 39లక్షలు అయిందట.
ఇక రెమ్యునరేషన్ కింద ముంబై కి చెందిన స్పెషలిస్ట్ కి 12లక్షలు ఇచ్చారట. మొత్తంగా విగ్గు కోసం 50లక్షలు వెచ్చించడం హాట్ టాపిక్ అయింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా విజయాన్ని నమోదుచేయడంతో హీరో బాలయ్య ఫుల్లు ఖుషీలో ఉన్నాడు.

