పుష్పలో బన్నీ మేకప్ కోసం ఎంత సమయం పట్టిందో తెలుసా ?
Allu Arjun pushpa Movie : స్టార్ హీరో సినిమా వస్తుంటేనే ఫాన్స్ లో ఓ పండగ వాతావరణం ఉంటుంది. ఇక సమయం దగ్గర పడేకొద్దీ హైటెన్షన్ నెలకొంటుంది. ఇప్పటికే హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తాజాగా పుష్ప మూవీ రూపుదిద్దుకుంది. పాన్ ఇండియా మూవీగా రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్17న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ల మోత మోగుతోంది.
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఇక మీడియా సమావేశాల్లో అల్లు అర్జున్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ఈ మూవీలో ఊర మాస్ క్యారెక్టర్ పుష్పరాజ్ పాత్ర బన్నీ చేస్తున్నాడు. అయితే ఈ పాత్ర కోసం కేవలం మేకప్‌కే రెండున్నర గంటల సమయం పట్టిందని, అది తీసేయడానికి మరో 30 నిమిషాల సమయం పట్టిందని వెల్లడించాడు.
ఇప్పటివరకు తన కెరీర్లో ఇంతటి మేకప్ అవసరం రాలేదని, చాలా మినిమల్ మేకపే వాడామని బన్నీ తెల్పాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన పుష్ప కోసం చాలా కష్టపడ్డామని, అటవీ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించాడు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే.

