MoviesTollywood news in telugu

పుష్ప ట్విట్టర్ రివ్యూ : అల్లు అర్జున్ బాక్సాఫీస్ దాడి ఖాయమేనా..?

Pushpa Twitter Review In Telugu : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా పలు భాషల్లో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పుష్ప’ మొదటి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో నేడు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

సినిమా చూసిన అభిమానులు బన్నీ కెరీర్ లో బెస్ట్ సినిమా అని, ఆయన రోల్ నెవర్ బిఫోర్ అని కితాబిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ నటన
అద్భుతంగా ఉందని, వెండితెరపై ఆయన యాటిట్యూడ్ మ్యానరిజం పీక్స్‌లో ఉన్నాయని అంటున్నారు. సందర్భాన్ని బట్టి వచ్చే పోరాట సన్ని వేశాలు, ఎలివేషన్స్ అదిరిపోయాయని, అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే పుష్ప మొదటి భాగానికి ఎండ్ అనేది ఇవ్వలేదని, రెండో భాగం వస్తేనే సినిమా కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. రెండో భాగం కోసం వేచి చూడక తప్పదని అంటున్నారు. సినిమాకి పాజిటివ్ అంశాలుగా అల్లు అర్జున్ నటనతో పాటు ఇంటర్వెల్ సీన్స్, అలాగే క్లైమాక్స్ సీన్స్ అని చెప్పుతున్నారు అభిమానులు.

ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్- రష్మిక నడుమ చిత్రీకరించిన కొన్ని సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెగెటివ్ పాయింట్స్ అని అంటున్నారు. ఊహించిన మేర హై మూమెంట్స్ కనిపించలేదని చెబుతున్నారు. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ఇలా అన్నీ రకాలుగా అదరగొట్టేశారని, రష్మిక మందన తన పాత్రకు న్యాయం చేసిందని,అనసూయ, సునీల్ రోల్స్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."