MoviesTollywood news in telugu

జక్కన్న తీసిన ఆ రెండు సినిమాలు బాలయ్య మిస్సయ్యాడా…?

Bala krishna And rajamouli : ఒకరిని దృష్టిలో పెట్టుకుని కథ అనుకుంటే మరొకరితో సినిమా తీయాల్సి వస్తుంది. ఇది ఇండస్ట్రీలో సర్వ సాధారణం. అగ్ర హీరోలు సైతం ఇలా ఎన్నో సినిమాలు మిస్ అవుతూ ఉంటారు. అయితే ఆతర్వాత వాళ్ళ కాంబినేషన్ లో సినిమా రాకపోవడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో మూవీ రాలేదు.

అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన రెండు సినిమాలు రాలేదు. ముందుగా ఆ సినిమాల కథలను బాలయ్యకు జక్కన్న చెప్పినప్పటికీ వివిధ కారణాల వలన కుదరక పోవడంతో వేరే వాళ్ళతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అందులో మొదటిది సింహాద్రి. ఈ సినిమా కథ ముందుగా బాలయ్యకు చెబితే, అప్పటికే బి గోపాల్ డైరెక్షన్ లో పలనాటి బ్రహ్మనాయుడు మూవీ తీస్తున్న కారణంగా ఒకే చెప్పలేదు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్స్ వర్షం కురిసింది.

అలాగే మగధీర మూవీ కథను కూడా ముందుగా బాలయ్య దగ్గరకు వెళ్ళింది. అయితే ఎందుకో ఈ సినిమా చేయలేదు. దాంతో రామ్ చరణ్ తో తీసిన మగధీర ఇండస్ట్రీ హిట్ అయింది. అయితే ఇంతవరకూ జక్కన్న, బాలయ్య కాంబోలో సినిమా రాలేదు. రవితేజ, ప్రభాస్, నితిన్, సునీల్ వంటి వాళ్లకు హిట్స్ ఇచ్చిన రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీసిన ఆర్ ఆర్ ఆర్ జనవరిలో రిలీజ్ కానుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."