MoviesTollywood news in telugu

ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ తీసిన సినిమాలు ఎన్నో తెలుసా ?

krishna against senior ntr movies : అప్పట్లో నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేది. పైగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరి మధ్య చాలా వార్ నడిచింది. ఏకంగా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి వదిలారు కృష్ణ. నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కృష్ణ తీసిన ఈనాడు మూవీ ఎన్టీఆర్ పార్టీ విజయానికి దోహద పడింది.

తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చేరడంతో ఎన్టీఆర్ విధానాలను ఎండగడుతూ డైరెక్ట్ సినిమాలు కృష్ణ తీశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరిన కృష్ణ రాష్ట్రంలో అధికారంలో ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వ విధానాలను తూర్పార బడుతూ .. సింహాసనం, నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి, గండిపేట రహస్యం వంటి సినిమాలు తీసాడు.

ఎన్టీఆర్ తరచూ వాడే కొన్ని ఊతపదాలను యధాతధంగా వాడుతూ తీసిన ఈ సినిమాల్లో సింహాసనం మూవీకి కృష్ణ తొలిసారి దర్శకత్వం వహించడం విశేషం. కొన్ని సినిమాలు విజయనిర్మల డైరెక్ట్ చేసారు. అయితే మండలాధీశుడు వంటి సినిమాల్లో కృష్ణ గెస్ట్ గా వేసి, వేరే వాళ్లతో నటింపజేసి కృష్ణ స్వయంగా సినిమా తీయడం మరో విశేషం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."