MoviesTollywood news in telugu

చైతు – నితిన్ మధ్య పోటీ ఇచ్చిన మూవీస్ ఎన్ని ఉన్నాయో…?

Naga Chaitanya And Nithin Movies : యంగ్ స్టార్స్ నితిన్, నాగ చైతన్య టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక దాదాపు పాతిక చిత్రాలు చేశారు. అయితే వీరిద్దరి సినిమాలు ఒకేసారి రిలీజై పోటీ పడ్డ సినిమాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఒక్కటంటే ఒక్కటి వెలుగులోకి వచ్చింది. అది కూడా నేరుగా కాకుండా ఒకరు థియేటర్ ద్వారా వస్తే, మరొకరు ఓటిటి ద్వారా పలకరించారు.

వాటి వివరాల్లోకి వెళ్తే, 2021సెప్టెంబర్ 17న నితిన్ నటించిన మాస్ట్రో మూవీ ఓటిటిలో వచ్చింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అందాదున్ కి రీమేక్ గా వచ్చిన ఈ మూవీని మెర్లపాటి గాంధీ దర్శకత్వం వహించాడు. మంచి వ్యూస్ దక్కించుకుని ఓపెనింగ్స్ అదరహో అన్పించింది.విడుదలకు ముందే భారీగా అమ్ముడై లాభాలను ఆర్జించిన ఈ మూవీ కామెడీ, థ్రిల్లర్ జోనర్ లో వచ్చింది.

ఇక మాస్ట్రో వచ్చిన వారం తర్వాత నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ రిలీజయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్ గా మెప్పించింది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ కలెక్షన్స్ రాబట్టింది. పవన్ సిహెచ్ అద్భుత మ్యూజిక్ ఇచ్చాడు. సారంగదారియా సాంగ్ కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. 68కోట్ల షేర్ రాబట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."