Devotional

Puja vessels:దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే ఎందుకు వాడుతారు?

copper utensils Worship :దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే ఎందుకు వాడుతారు.. మన సనాతన సంప్రదాయంలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగివున్నాయి. శాస్త్రీయత ఉంది. ఉదాహరణకు రాగి పాత్రలో రాత్రిళ్ళు నీళ్లు పోసి, ఉదయం సేవిస్తే ఆరోగ్య పరంగా మంచిదని, మామూలు సమయంలో కూడా రాగిపాత్రలో నీరు తాగితే అనారోగ్యాలు దరిచేరవని చెబుతారు.

రాగిపాత్రలో నీరు సేవిస్తే రక్త శుద్ధి జరిగి, శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతారు. ఇక పూజా సమయంలో కూడా రాగి వస్తువులు ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా రాగిపాత్రలో నీళ్లు పోసి, ఆచమనం చేస్తారు. అయితే పురాణ పరంగా కూడా రాగికి ప్రాధాన్యత ఉందని చెబుతూ ఉంటారు. అదేమిటంటే, గుడాకేశుడు అనే రాక్షసుడు పూర్వకాలంలో ఉండేవాడట.

విష్ణువు కోసం రాగి రూపంలో గుడాకేశుడు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకి మెచ్చి, విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తనకు వరం వద్దని, తన శరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండించి నీలో ఐక్యం చేసుకోమని కోరతాడు.

ఆత్మ నీలో ఐక్యం అయ్యాక తన శరీరంతో చేసిన వస్తువులను పూజకు వినియోగించాలని కోరతాడు. ఆవిధంగా పూజా సమయంలో రాగి పాత్రల వినియోగం వాడుకలోకి వచ్చాయట.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."