Beauty Tips

Hair lice:ఒక్కసారి రాస్తే చాలు ఇక జీవితంలో పేలు పట్టవు

Hair lice remove tips In Telugu : తలలో పేల సమస్య అనేది ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. తలలో పేలు ఉంటే చాలా దురద పెడుతుంది. ఆ దురద ఎక్కువైనప్పుడు చాలా చిరాకు వస్తుంది. తలలు పరస్పరం తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి పేలు వ్యాపిస్తుంటాయి. స్కూల్ కి వెళ్లే పిల్లల్లో పేల సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ మందితో కలిసి ఉండటం వల్ల కూడా పేల సమస్య పెరుగుతుంది. పేలు తలలో వెంట్రుకలను అంటిపెట్టుకొని రక్తాన్ని ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. పేలు ఒక్కసారి వచ్చాయంటే వాటిని వదిలించుకోవటం కష్టమే. తలలో పేలను వదిలించుకోవడానికి ఎటువంటి రసాయనాలు వాడవలసిన అవసరం లేదు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ vaseline, రెండు కర్పూరం బిళ్లలను పొడి చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఘాటైన వాసనకు పేలని మత్తుగా చనిపోయి ఉంటాయి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసి చిన్న పళ్ళతో దగ్గరగా ఉన్న దువ్వెనతో దువ్వితే చచ్చిపోయిన పేలు, గుడ్లు అన్ని బయటకు వచ్చేస్తాయి.

పేల సమస్య ఉన్నవారు వారంలో ఒకసారి ఈ విధంగా చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయట పడతారు. ఈ మిశ్రమం తలకు రాయటం వలన చుండ్రు,దురద వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."