MoviesTollywood news in telugu

RRR కారణంగా ఎన్టీఆర్ కు 200 కోట్ల నష్టం…ఎలా…చూడండి

RRR Movie : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు పార్టుల తర్వాత భారీస్థాయిలో ఆర్ ఆర్ ఆర్ మూవీని మల్టీస్టారర్ గా తెర కెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌‌‌‌చరణ్ లు కలిసి నటిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ ఇతర భాషా నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం తారక్, చెర్రీలు ఏకంగా రెండేళ్లు డేట్స్ ఇచ్చారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ మరో రెండు సంవత్సరాలు దాటడంతో మొత్తం ఈ సినిమా 4ఏళ్ళు సమయం తీసుకుంది. ఫలితంగా తారక్ చాలా నష్టపోయాడనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద 200కోట్లు లాస్ అయ్యాడని టాక్. ఎందుకంటే, ఆర్ ఆర్ ఆర్ కోసం తారక్ 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్.

ఇక కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా ఒక్కటే ఉంది. పైగా ఇది ప్రస్తుతానికి పాన్ ఇండియా మూవీ కూడా కాదు. భవిష్యత్తులో పాన్ ఇండియా మూవీ అవుతుందో లేదో చెప్పలేం. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ మూవీ చేయకపోతే , ఆ సమయంలో కనీసం 6 సినిమాలు చేస్తే, 200 కోట్లు వచ్చేదని అంచనా. పాన్ ఇండియా ఇమేజ్ లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50 కోట్లు చొప్పున తీసుకుంటున్నపుడు తారక్ కి ఎంత వచ్చేదో అని ఫిలింనగర్ వర్గాలు లెక్కలేస్తున్నాయి.

ఇదంతా ఎందుకంటే, ఆర్ ఆర్ ఆర్ సినిమా సెట్స్ పై ఉండగా, ఆచార్య సినిమాలో కీలక పాత్ర చేసేసిన చెర్రీ ఆ తర్వాత శంకర్ మూవీకి కూడా ఒకే చెప్పేసాడు. పైగా శంకర్ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. మరోపక్క జెర్సీ మూవీ ఫేం గౌతమ్ తిన్ననూరితో మూవీ ఒకే చేసాడు. ఆచార్య తప్ప మిగిలిన 2 సినిమాలు పాన్ ఇండియా మూవీలే.

కానీ తారక్ విషయంలో తేడా కొట్టిందని అంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ రిలీజ్‌‌కి దగ్గరపడి పలుమార్లు వాయిదా పడింది. తాజాగా జనవరి 7న రావాల్సిన ఈ సినిమా మళ్ళీ వాయిదా పడింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో అదరగొట్టేసిన ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."