MoviesTollywood news in telugu

ప్రొడ్యూసర్ కి ఇల్లు కట్టించిన కృష్ణ , శ్రీదేవి…అసలు విషయం ఏమిటంటే…

Krishna And Sridevi : సూపర్ స్టార్ కృష్ణను నిర్మాతల పాలిట కల్పతరువుగా భావిస్తారు. సినిమా ఆడకపోతే రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేయడమో, మరో సినిమా ఉచితంగా చేసిపెట్టడమో చేస్తుంటారు. అయితే సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశతో ఉన్న నిర్మాతకు కృష్ణ తో పాటు శ్రీదేవి, మరికొందరు కూడా సహకరించారు. దాంతో ఇల్లేంటి, అమ్మేసుకున్న పొలం కూడా తిరిగి కొనుక్కున్నారట.

ఇదేమిటి అనుకుంటున్నారా నిజం. మామా అల్లుళ్ళ సవాల్ మూవీలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించారు. ఇందులో కృష్ణ అక్క పాత్రలో జమున చేసింది. జమున భర్తగా కైకాల సత్యనారాయణ, కూతురుగా శ్రీదేవి నటించారు. అయితే ఈ చిత్ర నిర్మాత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక మేరకు కృష్ణ, శ్రీదేవి, జమున, డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్ కూడా రెమ్యునరేషన్ తగ్గించుకున్నారట.

అసలు విషయం ఏమిటంటే, సత్యనారాయణతో నాపేరే భగవాన్ అనే మూవీని కుదరవల్లి సీతారామమూర్తి అనే ప్రొడ్యూసర్ సినిమా తీశారు. సినిమా బాగున్నా సరే, నిర్మాతకు డబ్బు రాలేదు. దాంతో సొంత ఊరిలో ఇల్లు కట్టుకువాలన్న కోరిక తీరలేదు. ఈ విషయాన్ని కృష్ణకు సత్యనారాయణ చెప్పడంతో మామా అల్లుళ్ళ సవాల్ మూవీకి రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. ఇక కృష్ణ శ్రీదేవి జంటగా 31మూవీస్ చేయగా, అందులో చాలా హిట్ కావడంతో హిట్ ఫెయిర్ గా నిలిచారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."