వారంలో 2 సార్లు ఇది రాస్తే చాలు.. చుండ్రు మాయం, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!
Cloves Hair Fall Tips : వారంలో 2 సార్లు ఇది రాస్తే చాలు.. చుండ్రు మాయం, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువ అయింది. కరోనా వచ్చి తగ్గిన వారిలో కూడా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనపడుతుంది.
జుట్టు రాలటం ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో దొరికే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.

ఒక బౌల్ లో అరస్పూన్ బ్రహ్మీ పౌడర్, అరస్పూన్ మునగ ఆకు పొడి, అరస్పూన్ లవంగాల పొడి, అరస్పూన్ తులసి పొడి, షాంపూ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసి పావుగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
చుండ్రు సమస్య ఉంటే జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ అవుతుంది. ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా కూడా మారుతుంది. మునగ ఆకు పొడి, లవంగాల పొడి,తులసి పొడిని మనం ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. బ్రహ్మీ పొడిని మాత్రం మార్కెట్ లో కొనుగోలు చేయవచ్చు.
జుట్టు చివర్లలు చిట్లటం కూడా తగ్గుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి తెల్లజుట్టు సమస్య ఉన్నవారు కూడా ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Source: chaipakodi.com

