Beauty TipsHealth

Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. కొబ్బరి నూనెతో ఇలా చేస్తే..

cracked heels Home Remedies in telugu : కొందరిలో కాళ్లమీద పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి నొప్పిని కలిగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మడమల మీద ఈ పగుళ్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సాధారణంగా చాలామందిలో కాళ్ల పగుళ్లు చలికాలంలో వస్తుంటాయి.

కానీ కొందరిలో మాత్రం వేసవిలోనూ కనిపిస్తుంటాయి. పాదాల పగుళ్ళు ప్రారంభంలో అంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తే మంచి ఫలితం కనబడుతుంది. మనలో చాలామంది పాదాల పగుళ్లు కనబడగానే Ointment కోసం చూస్తారు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే Ointment జోలికి వెళ్లకుండా ఉంటారు.

రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో పాదాలకు మసాజ్ చేయాలి. మసాజ్ చేయడానికి ముందు పాదాలను మురికి వదిలే వరకు బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఆ తర్వాత నూనె రాసి మసాజ్ చేసి సాక్స్ వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం పాదాలను శుభ్రంగా కడగాలి. ఈ విధంగా కొన్ని రోజులపాటు చేస్తే మృదువైన పాదాలు మీ సొంతం అవుతాయి

కొబ్బరి నూనె పొడి చర్మానికి తేమను అందిస్తుంది. పగిలిన మడమలకు కొబ్బరినూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్ E, ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.

అలాగే కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్‌ ఉంటుంది. ఇది కూడా దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయటమే కాకుండా కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే సర్క్యులేషన్ బాగా జరిగి పాదాలు తేమని కోల్పోకుండా ఉంటాయి. పాదాల పగుళ్లు వచ్చినప్పుడు ఖరీదైన Ointments వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."