MoviesTollywood news in telugu

శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ మీనాక్షి రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Srimathi srinivas Serial : స్టార్ మా ఛానల్ లో ఇటీవల స్టార్ట్ అయిన శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ పొందుతోంది. కొద్దిరోజులకే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో హీరోయిన్ శ్రీదేవి తల్లి క్యారెక్టర్ లో మీనాక్షి తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంటోంది. మంచి ఫాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. మీనాక్షి అసలు పేరు షీలా సింగ్. షీలా భర్త పేరు కళ్యాణ్. ఈయన క్లాత్ బిజినెస్ చేస్తారు.

షీలా దంపతులకు ఇషాంత్ అనే కొడుకు ఉన్నాడు. మొగలి రేకులు సీరియల్ లో ఈమె నటనకు అప్పట్లో మంచి పేరు వచ్చింది. వరంగల్ జిల్లా డోర్నకల్ లో పుట్టి పెరిగిన షీలా సింగ్ తల్లి తెలంగాణ అయినా తండ్రిది ఉత్తర ప్రదేశ్. ఈమెకు ముగ్గురు అన్నయ్యలు, ఓ అక్క ఉన్నారు. పదవతరగతిలో ఉండగా ఓ ఫిలింలో ఛాన్స్ వచ్చింది. దీంతో స్టడీస్ కి గుడ్ బై చెప్పేసి, నటనా రంగంలో అడుగుపెట్టింది.

సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ, షీలా మంచి పేరు తెచ్చుకుంది. నీ మనసు నాకు తెలుసు, ధైర్యం, చంటిగాడు వంటి మూవీస్ లో నటించి మెప్పించిన ఈమె ప్రియాంక సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. మధువాణి, బొమ్మరిల్లు, కన్యాదానం, మా ఆడపడుచు, మొగలి రేకులు, నిన్నే పెళ్లాడతా, మట్టిగాజులు, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి సీరియల్స్ లో చేసింది. మీనాక్షి సీరియల్ తో పాటు శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో ప్రస్తుతం నటిస్తోంది .

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."