ఈ ఫోటోలోని చిన్నారి స్టార్ హీరోయిన్…ఎవరో గుర్తు పట్టారా..?
Tollywood Heroine shalini pandey : ఒకప్పుడు సెలబ్రిటీల గురించి అభిమానులకు కొన్ని విషయాలే తెలిసేవి. ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం వలన సెలబ్రిటీలకు, ఫాన్స్ కి మధ్య గ్యాప్ తగ్గిపోయింది. ముఖ్యంగా హీరోయిన్స్ చైల్డిష్ట్ ఫోటోలు షేర్ అవ్వగానే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అర్జున్ రెడ్డి మూవీ హీరోయిన్ షాలిని పాండే చిన్నప్పటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మధ్యప్రదేశ్‌లోని, జబల్ పూర్‌లో 1993 సెప్టెంబర్ 23న జన్మించిన షాలిని పాండే జబల్ పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.2017లో అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి యూత్ లో మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, ఉత్తమ నటి అవార్డు అందుకుంది తరువాత మహానటి, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్ధం మూవీస్ లో చేసింది.
హిందీలో మేరి నిమ్ము మూవీలో గెస్ట్ రోల్ చేసిన షాలిని పాండే.. బాలయ్య నటించిన ఎన్.టి.ఆర్. కథానాయకుడులో షావుకారు జానకిగా మెరిసింది. తమిళంలో 100 పర్శంట్ కాదల్, గోరిల్లా, సైలెన్స్ మూవీస్ లో నటించిన ఈమె 018లో నా ప్రాణమయ్ పాట కోసం స్వరాన్ని అందించింది. ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరు రావడం లేదు. తాజాగా నోట్లో వేలుపెట్టుకున్న చిన్నప్పయిటి ఫొటోతో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

