Beauty Tips

Tips For Pink Lips:బంగాళాదుంపతో ఇలా చేస్తే నల్లగా ఉన్న పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

Tips For Pink Lips : మారిన వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, డీహైడ్రేషన్ వంటి అనేక రకాల కారణాలతో పెదాలు నల్లగా మారుతాయి. నల్లగా మారిన పెదాలు గులాబీ రంగులో మారాలంటే ఖరీదైన క్రీములు, లిప్ బామ్ వంటివి వాడాల్సిన అవసరం లేదు. ఇంటిలోనే సహజసిద్ధంగా పెదాలు ఎర్రగా, అందంగా, మెరిసేలా చేసుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ బంగాళదుంప రసం, ఒక స్పూన్ బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని పెదాలకు రాత్రి సమయంలో రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే సరిపోతుంది ఈ విధంగా నాలుగు రోజుల పాటు చేస్తే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నిమ్మరసంలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల నల్లని పెదాలను తొలగించటానికి సహాయపడుతుంది. బీట్ రూట్ లో ఉండే లక్షణాలు పెదాలకు గులాబీ రంగును ఇవ్వటమే కాకుండా పొడి, పగిలిన పెదాలను తగ్గించటానికి సహాయపడుతుంది పెదాలను మృదువుగా చేస్తుంది. బంగాళాదుంప పెదాల నలుపును తగ్గించటానికి సహాయపడుతుంది.

లిప్ బామ్ వాడేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 30 కంటే ఎక్కువ SPF ఉన్న లిప్ బామ్‌ను కొనుగోలు చేయాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ బామ్ మీ పెదాలను టాన్‌గా ఉంచుతుంది. నాసిరకం లిప్ బామ్‌లు పెదాలను నల్లగా మారుస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."