Beauty Tips

Lips Beauty Tips:ఈ నూనెలో ఇది కలిపి పెదాలకు రాస్తే నల్లని పెదాలు గులాబీ రంగులోకి మారతాయి

Dark Lips Home Remeides : ముఖం అందంగా ఉండాలంటే పెదాలు కూడా అందంగా ఉండాలి. పెదాలు అందంగా ఉండటానికి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది నల్లని పెదాలను గులాబీ రంగులోకి మరటానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో నల్లని పెదాలు గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి.

నువ్వుల నూనె పెదాలపై నలుపును తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. నువ్వుల నూనెను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. అరస్పూన్ నువ్వుల నూనెలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి పెదాలకు రాసి పది నిమిషాలు అయ్యాక సాదరణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నలుపు క్రమంగా తగ్గుతుంది.

ఒక స్పూన్ నువ్వుల నూనెలో అరస్పూన్ కొబ్బరి నూనె కలిపి పెదాలకు రాయాలి. పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే పెదాల నలుపు క్రమంగా తగ్గి గులాబీ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. మీకు లభ్యం అయిన దాన్ని బట్టి ఒక రెమిడీ ఫాలో అయితే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."