Beauty Tips

Flax Seeds For Hair:జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలా? ఈ అవిసె గింజల జెల్ తలకు రాస్తే చాలు!

Flax Seeds For Hair:జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగాలా? ఈ అవిసె గింజల జెల్ తలకు రాస్తే చాలు.. అవిసె గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కేశ సంరక్షణకు కూడా చాలా మంచిది. జుట్టు సమస్యలకు సమర్థవంతంగా పనిచేస్తాయి. వాటిలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు కోసం అవిసె గింజలను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్‌ని నివారిస్తుంది. మీ జుట్టును బలోపేతం చేస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మారిన జీవనశైలి, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ప్రయోజనం లేక నిరాశ చెందుతూ ఉంటారు. అలా నిరాశ చెందకుండా ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది.

ఈ మధ్య కాలంలో ఆవిసే గింజల వాడకం చాలా ఎక్కువ అయింది. ఆవిసే గింజలలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల ఆవిసే గింజలను వేసి 5 నిమిషాల పాటు మరిగిస్తే జెల్ తయారవుతుంది.

ఈ జెల్ ని వేడిగా ఉన్నప్పుడే వడకట్టాలి. ఈ జెల్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు, అలాగే తల మీద చర్మంపై కూడా బాగా పట్టేలా పట్టించాలి. అరగంట అలా వదిలేసి ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఆవిసే గింజలలో ఉండే విటమిన్ E జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. జుట్టు మూలాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. ఈ జెల్ ని ఎక్కువగా తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెట్టి దాదాపుగా 15 రోజుల వరకు వాడుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."