Beauty Tips

Remove Warts: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో పరార్..

Remove Warts: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో పరార్.. ఒంటిపై ఉన్న పులిపిర్లను తొలగించాలంటే ఇక్కడ చెప్పే టిప్స్ పాటించండి. పులిపిర్లు అనేవి హ్యూమన్ పాపిలో వైరస్ వల్ల వస్తాయి. పులిపిర్లను తొలగించడంలో వెల్లుల్లి ఎక్కువగా ఉపయోగపడుతుంది.

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. పులిపిరికాయలని ఇంగ్లీష్ లో వార్ట్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా మెడ మీద ముఖం మీద చేతులు మీద పాదాలు మీద వస్తూ ఉంటాయి. వీటిని అసలు అశ్రద్ద చేయకూడదు. వీటిని తొలగించుకోవటానికి మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి.

ఒక కొవ్వొత్తిని తీసుకొని తురమాలి.ఒక స్పూన్ కొవ్వొత్తి తురుమును ఒక బౌల్ లో వేసుకోవాలి. ఆ తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసి వేయాలి. ఆ తర్వాత పావు స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. ఈ మూడింటిని బాగా కలపాలి. వీటిని డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి. కొవ్వొత్తి కరిగే వరకు వేడి చేయాలి.

ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే టూత్ పిక్ గాని పుల్లతో గాని పులిపిర్లు ఉన్నచోట రాసి ప్లాస్టర్ వేయాలి. మూడు గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకున్న పర్వాలేదు. ఈ విధంగా రోజుకి ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి.

పులిపిర్లు రాగానే చాలా మంది పులిపిర్లను కాల్చడం, కత్తిరించడం వంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఈ చిట్కా ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిట్కా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."